ఎల్లుండి ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ..ఏర్పాట్లు పూర్తి

-

ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. అయితే… ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఎల్లుండి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Prime Minister Modi’s visit to Ellundi AP

తాత్కాలికంగా ఖరారైన ప్రోగ్రాం ప్రకారం ఎల్లుండి మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిదప అదే రోజు సాయంత్రం తిరిగి వెళ్ళనున్నారని తెలిపారు. కావున ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పీలను సిఎస్ ఆదేశించారు.అదే విధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా వర్చువల్ గా పాల్గొన్న డిజిపి రాజేంద్ర నాధ్ రెడ్డికి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version