పులివెందుల, ఒంటిమిట్టలో పోలింగ్ ముగిసింది. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ కల్పిస్తున్నారు. పులివెందుల మండలంలోని రెండు గ్రామాల్లో గొడవలు జరిగాయి. ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లి, మంటపంపల్లిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేసులు నమోదు అయ్యే స్థాయిలో గొడవలు జరగలేదన్నారు కడప డీఐజీ.

వైసీపీ వాళ్లు ఏదో చేస్తున్నారు అనుకొని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తొందరపడి ఒంటిమిట్టలో పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్ళాడని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు, జరగనివ్వం అని పేర్కొన్నారు కడప డీఐజీ. ఐదు గంటల వరకు పులివెందులలో 74.57 శాతం, ఒంటిమిట్టలో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది పోటీ చేశారు. ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.