తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి ఉండాలని టీటీడీ వెల్లడించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని టీటీడీ తెలిపింది. భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించవమని టిటిడి స్పష్టం చేసింది.

దీంతో తిరుమలకు వెళ్లే వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలని టిటిడి వెల్లడించింది. ఇదిలా ఉండగా…. తిరుమలలో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. క్యూలైన్లలో భక్తులు నిండిపోయి స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.