కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కొనసాగుతున్నదా? లేదా అన్నది? తమ పార్టీ నేతలకు అనవసరమని రఘురామకృష్ణ రాజు అన్నారు. తాము ఎవరితో కలిస్తే మీకెందుకు, ఎన్ని స్థానాలలో పోటీ చేస్తే మీకెందుకు?, ఎన్డీఏలో కొనసాగుతున్నామా? లేదా అన్నది కూడా మీకు అనవసరం అని పవన్ కళ్యాణ్ గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారని, తమ పార్టీ నేతల నుంచి ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నామన్న ఆయన, టీడీపీ, జనసేన కూటమితో కలిసి వచ్చేలా బిజెపితో మంతనాలను జరుపుతున్నామని చెప్పారని అన్నారు.
ఒకవైపు 175కు 175 స్థానాలలో గెలుస్తామని చెబుతూనే, మరొకవైపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తారా అంటూ ప్రశ్నించడం తమ పార్టీ నాయకుల దివాలా కోరుతనాన్ని తెలియజేస్తోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మాజీమంత్రి పేర్ని నాని గారు, అవంతి శ్రీనివాస్ గారు వంటి వారిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జీ 20 సదస్సులో బీజేపీ నాయకత్వం బిజీ ఉండగా, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశంతో పొత్తును ప్రకటించాల్సి వచ్చిందన్న పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి బీజేపీని కూడా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు.