ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైన్యమైన వాలంటీర్ల ఆగడాలను రఘురామకృష్ణ రాజు వివరించారు. దర్శి గ్రామ వాలంటీర్ అశోక్ ఒక బాలికపై అత్యాచారం చేయబోగా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారని, బాలికపై అత్యాచారం చేయబోయిన వాలంటీర్ ను స్థానిక ఎంపిడిఓ కుసుమ కుమారి సస్పెండ్ చేశారని తెలిపారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని బొమ్మరాటపల్లి వాలంటీర్ ఇంట్లో అక్రమ మద్యం సీసాలు పోలీసులకు లభించాయని, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న బయ్యా రెడ్డి అనే వాలంటీర్ ను స్థానిక తహసీల్దార్ సస్పెండ్ చేశారని, ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. నకిలీ విలేకర్ల అవతారం ఎత్తి ఇద్దరు వాలంటీర్లు రమేష్, దస్తగిరి అక్రమ వసూళ్లకు పాల్పడగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.