ఏపీ రాజకీయాల్లోకి షర్మిల..వైసీపీకి షాక్ తప్పదు – వైసీపీ ఎంపీ

-

జగన్ మోహన్ రెడ్డి  విడిచిన బాణం షర్మిల తమ పార్టీకే తగిలే అవకాశం కనిపిస్తోందని, షర్మిల గారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే, దాని ప్రభావం తమ పార్టీపైనే తీవ్ర ఉండనుందని అన్నారు రఘురామకృష్ణ రాజు. తమ పార్టీకి చెందిన మూడు నుంచి నాలుగు శాతం ఓట్లపై షర్మిల గారు తీవ్ర ప్రభావం చూపనుందని, క్రైస్తవ మతానికి చెందిన ఓటర్లను ఆమె తీవ్రంగా ప్రభావితం చేయనున్నారని పేర్కొన్నారు.

షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే, బ్రదర్ అనిల్ గారు కూడా ఆ పార్టీలో చేరినట్లేనని, క్రైస్తవ మత ఓటర్ల పై ఆయన ప్రభావం అధికంగా ఉండనుందని, గత ఎన్నికల్లో షర్మిల గారు, ఆమె భర్త అనిల్ గారు తనకు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏది చేయరని, ఏదైతే చేశాడో అదే చెబుతారని అన్నారు. తల్లి, చెల్లి, బాబాయిని చూసినట్టుగానే ప్రజల్ని కూడా చూస్తున్నారని, కులము చూడను మతం చూడను అని చెబుతూ, తన కులం, తన మతాన్ని మాత్రమే చూసుకుంటున్నారని, తన గెలుపు కోసం కష్టపడిన తల్లి, చెల్లి, బామ్మర్దిని బయటకు గెంటేశారని, ద్వాపర యుగంలో కంసుడు చెల్లిని జైల్లో పెడితే, ఈ కంసుడు మాత్రం చెల్లిని రాష్ట్రాన్ని దాటించాడని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version