రోజా ఇష్యూలోకి శ్రీరెడ్డిని లాగారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా రెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారు చేసిన వ్యాఖ్యలపై ఆయన బేషరతుగా క్షమాపణలను చెప్పారని పేర్కొన్నారు రఘురామకృష్ణ రాజు. రోజా రెడ్డి గారికి మద్దతుగా సినీ హీరోయిన్లు రమ్యకృష్ణ గారు, మీనా గారు, తమ పార్టీకి అత్యంత సానుభూతిపరురాలు అయినా శ్రీ రెడ్డి గారు స్పందించారని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే… తాను కూడా అంగీకరిస్తానని, అయితే గత శాసనసభలో దళిత శాసన సభ్యురాళ్ళైనా వంగలపూడి అనిత గారిని, పీతల సుజాత గారిని ఉద్దేశించి రోజా రెడ్డి గారు వ్యంగ్య వ్యాఖ్యలు సైగలు చేసినప్పుడు వీరు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
తమ తోటి నటీమణి అని స్పందించి ఉంటారు సంతోషం అని, అందుకు వారిని తానూ అభినందిస్తున్నానని అన్నారు. అసభ్యకర వ్యాఖ్యలు చేశారని గగ్గోలు పెడుతున్న ఈ నటీమణులు తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ట్ ఒకరు, పార్టీ నాయకుడొకరు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హైందవ స్త్రీలను అవమానించే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన అరెస్టును నిరసిస్తూ ర్యాలీలలో పాల్గొన్న మహిళలను తాళిబొట్టును తీసి పక్కన పెట్టి పాల్గొనాలనడం సిగ్గుచేటని, తాళిబొట్టు ఎప్పుడు తీసి పక్కన పెడతారో తెలుసా?, ఈ చెత్త వెధవలకు అంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. తాళిని గౌరవించే ఏ స్త్రీ అయినా తమ పార్టీకి ఓటు వేస్తారా?. ఇటువంటి దరిద్రులకు ఓటు వేయాలా?? అని మహిళలు భావించే అవకాశం ఉందని అన్నారు.