తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి 24వరకు (ప్రతి ఆదివారం) తిరుపతి – చర్లపల్లి (07481) మార్గంలో నాలుగు రైళ్లు, ఆగస్టు 4నుంచి 25వరకు (ప్రతి సోమవారం)

చర్లపల్లి – తిరుపతి (07482) రూట్లలో నడుపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి సన్నిధిలో మరోసారి చిరుత సంచారం చేసింది. అలిపిరి జూ పార్క్ రోడ్డు సమీపంలో చిరుత కనిపించింది. అరవింద్ ఐ ఆస్పత్రి వద్ద… చెక్కర్లు కొట్టింది చిరుత. ఇక ఇది చూసిన తిరుమల శ్రీవారి భక్తులు… భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు.