వాయుగుండం..నేడు తుఫానుగా బలపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడింది వాయుగుండం. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనికి ‘దానా’ తుఫానుగా పేరు పెట్టింది భారత వాతావరణ కేంద్రం.
ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో VZM, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో నాలుగు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.