జగన్ అసెంబ్లీకి రాకపోతే బోర్ కొడుతుందంటూ ఎద్దేవా చేశారు రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైయస్ఆర్ సీపీ పార్టీ ఒక 420 , వారు ఇక మారరన్నారు. మాజీ ఎంపీ భరత్ బాధ్యతగా వ్యవహారించాలని… మీరే కార్ మీరే తగల బెట్టుకుని మాపై నిందల అంటూ ఆగ్రహించారు. నేను నమ్మే రాజ్యాంగం, ప్రజల పై ప్రమాణం చేసి చెబుతున్న భరత్ రాజకీయ ఆటలు ఆడుతున్నాడు.
రాజమండ్రికి భరత్ చేసిన నష్టాలు ప్రజలు గమనించాలని కోరారు. చిల్లర మాటలు మాట్లాడటం భరత్ ఇకనైనా కట్టబెట్టాలి…మంచి చేసి ఒడిపోయామన్న జగన్ కి ఫస్ట్ స్టేట్ ఆఫ్ హ్యల్లూజేషన్ వచ్చిందని చురకలు అంటించారు. శాసనసభలో జగన్ లేకపోవడం బోర్ కొడుతుంది….భరత్ రామ్ పద్ధతి మార్చుకో, ప్రతిపక్షంలో పోరాడి బయటకి వచ్చిన నాయకులం మేమన్నారు. ఇంకా గంజాయి, బ్లేడ్ బ్యాచ్ తో భరత్ తిరుగుతున్నారు….పబ్లిసిటీ కోసం దేవుడిని మధ్యలో ఎందుకు తీసుకువస్తున్నావని ఫైర్ అయ్యారు రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్..