అచ్చెన్న కోసం రాము కండువా మార్చేస్తాడా…?

-

ఏపీలో ఇప్పుడు అధికార వైఎస్సార్‌సీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సీఎం జ‌గ‌న్ చాలా బ‌లంగా ఉన్నాడు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌ను ఢీకొట్ట‌డం ఏ రాజ‌కీయ నాయ‌కుడి వ‌ల్ల సాధ్యం కాద‌న్న‌ది తేలిపోయింది. జ‌గ‌న్ రోజు రోజుకు మ‌రింత బ‌లోపేతం అవుతున్నాడు. జ‌గ‌న్ దెబ్బ‌కు టీడీపీలో ఉండ‌లేక‌.. రాజ‌కీయ భ‌విష్య‌త్తు వెతుక్కుంటోన్న వాళ్లు అంద‌రూ ఫ్యాన్ కింద సేద తీరేందుకు ఈ పార్టీలోకి వ‌చ్చేస్తున్నారు. గంటా శ్రీనివాస‌రావు లాంటి వాళ్లు సైతం వైసీపీ రూట్లోనే ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు రానివారు… వైసీపీలో ఇమ‌డ‌లేం అని డిసైడ్ అయిన వారికి ఇప్పుడు బీజేపీ మంచి ఆప్ష‌న్‌గా ఉంది. అందుకే టీడీపీలో ఉండి రాజ‌కీయంగా ఇబ్బంది ప‌డ‌డం కంటే.. వ్యాపారాల్లో న‌ష్ట‌పోవ‌డం కంటే బీజేపీలోకి వెళ్లిపోవ‌డ‌మే బెట‌ర్ అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టీడీపీకి చెందిన ఓ యువ‌నేత సైతం అదే రూట్లో ఉన్న‌ట్టు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇప్ప‌టికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యి రెండు నెల‌లు అవుతోంది.

ఆయ‌న‌కు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు నుంచి కూడా బెయిల్ వ‌చ్చే ప‌రిస్థితులు లేవు. మ‌రో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి బెయిల్ వ‌చ్చి.. అచ్చెన్న‌కు బెయిల్ రాక‌పోవ‌డంతో కింజ‌రాపు ఫ్యామిలీతో పాటు ఆ కుటుంబ అభిమానులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌రోవైపు రామ్మోహ‌న్ నాయుడు ఎంత అరిచీ గీపెడుతున్నా క‌నీసం టీడీపీ శ్రేణుల నుంచి కూడా స్పంద‌న లేదు. మ‌రోవైపు అచ్చెన్న‌ను అనారోగ్యం కూడా వెంటాడుతోంది.

అచ్చెన్న‌కు బెయిల్ కోసం రామ్మోహ‌న్ నాయుడు బీజేపీకి చెందిన ఎంపీ సుజ‌నా చౌద‌రిని ఆశ్ర‌యించిన‌ట్టు టాక్‌..?  ఇప్ప‌టికే రాము త‌న స్థాయిలో లాబీయింగ్ స్టార్ట్ చేశార‌ట‌. అవ‌స‌రం అయితే టీడీపీ నుంచి స‌రైన ఆద‌రణ లేద‌ని భావిస్తోన్న ప‌క్షంలో బీజేపీ గూటికి అయినా చేరిపోవ‌చ్చ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version