పోలీసులను తిట్టడంపై ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ఒక ప్రకటన లో వివరణ ఇచ్చారు. నేను ఓ మంత్రి భార్యగా ప్రభుత్వ ప్రవేట్ కార్యక్రమాలకు హాజరై య్యాను…నేను ఎక్కడా పోలీసుల సెక్యూరిటీ కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది…ఈ కార్యక్రమానికి సెక్యూరిటీ అవసరమని పోలీసులే నాతో చెప్పారన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పోలీసు అధికారి సివిల్ డ్రెస్ లో నిర్లక్ష్యంగా హాజరవడం న్యాయమా…అని ప్రశ్నించారు.
ఆ పోలీస్ అధికారి కోసం నేను నడిరోడ్డుపై గంటకు పైగా వేచి చూశాను…కాస్త అసహనంగా ఒక పోలీసు అధికారిని ఇలా సివిల్ డ్రెస్ లో రావడం ఏంటి అని మాత్రమే అడిగాను అని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవడానికి ఎందుకింత నిర్లక్ష్యం అని మాత్రమే అడిగాను…ఆ అధికారి నిర్లక్ష్యం పై నేను ప్రశ్నించానని వివరించారు. ఒక మంత్రి భార్య గా ఇలా చేయడం ఇష్యూ గా మారిందా ? లేక ప్రజలు, మీడియా ఇలా కోరుకుంటుందా…కొందరు ప్రభుత్వ ఉద్యోగులలో క్రమశిక్షణ రాహిత్యం మరియు అసంబద్ధతకు మద్దతు ఇవ్వడం సహేతుకమేనా అని ప్రశ్నించారు.