7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు

-

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు ప్రగతిపథంలోకి దూసుకెళ్లాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాలను చాలా అభివృద్ధి చేశామని, ఎన్నో పంచాయతీలకు పలు రకాల పురస్కారాలు కూడా వచ్చాయని తెలిపారు. కానీ 7 నెలల కాంగ్రెస్‌ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని హరీశ్ రావు తెలిపారు.

తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలను కేసీఆర్‌ నిలిపారని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి లేదని.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామానికి ఒక చెత్త సేకరణ ట్రాక్టర్‌ కేటాయించామన్న హరీశ్ రావు.. పంచాయతీ అవార్డుల్లో ఎక్కవ భాగం తెలంగాణ గ్రామాలకే వచ్చేవని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు ఉద్యోగుల జీతం ఖర్చు చేస్తున్నారని.. చాలా పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version