బెజవాడ పెనమలూరులో భారీగా రేషన్ బియ్యం డంప్ కలకలం రేపుతోంది. ఆకస్మిక దాడుల్లో డంప్ ను గుర్తించిన సివిల్ సప్లయి, రెవెన్యూ అధికారుల బృందం. ఈడుపు గల్లులో భారీ గోడౌన్ ఏర్పాటు చేసుకుని రేషన్ మాఫియా PDS బియ్యంను అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఈ మధ్య కాలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లుల పైన ఆకస్మిక తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న కీడా రెండు మిల్లులను మంత్రి సీజ్ చేసారు.
అయితే ఈ రేషన్ బియ్యం పైన కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదులు వెళ్ళటంతో.. అధికారులు ఆకస్మిక దాడులు చేసారు. లాడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ రేషన్ మాఫీయా నడుపుతున్న ఫణి, కాంతి, కిరణ్, శ్రీకాంత్ వద్ద నుండి ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. స్టాక్ లెక్కలు వేస్తున్నారు సివిల్ సప్లయి శాఖ అధికారులు.