Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో రెడ్ అలర్ట్

-

Red Alert at Rajahmundry Airport on Independence Day: తూర్పు గోదావరి జిల్లా కలకలం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సంద ర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిగా విమానాశ్రయంలో రక్షణ విషయంలో అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

Red Alert at Rajahmundry Airport on Independence Day

సందర్శకుల అనుమతి రద్దు చేస్తూ రాకపోకలు సాగించేవారిపై పూర్తి స్థాయిలో నిఘా పెడుతున్నారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకే ముఖద్వారం నుంచి లోపలికి అనుమతి ఇస్తున్నారు. విమానాశ్రయం శివారు చుట్టూ 9 వాచ్ టవర్ల ద్వారా 24 గంటలు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేసి పహారా ఏర్పాటు చేసింది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version