తిరుమల శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు అందించిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల

-

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు అందించిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేశారు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి. ఆలయాల నిర్మాణంకు,దళారి వ్యవస్థని అరికట్టడానికి శ్రీవాణి ట్రస్ట్ లో దర్శన విధానాని ప్రారంభించామని… 70 మంది దళారిలను అరేస్ట్ చెయ్యడంతో పాటు,దళారుల పై 214 కేసులు నమోదు చేసామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు ఇచ్చిన విరాళాలుకు టిక్కేట్లుతో పాటు రసీదు ఇస్తూన్నామని వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 861 కోట్లు విరాళాలు అందితే….603 కోట్లు బ్యాంకులో డిఫాజిట్లు చెయ్యగా…వివిధ బ్యాంకుల అకౌంట్లో 139 కోట్లు నిధులు వచ్చాయన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిఫాజిట్లు పై 36 కోట్లు వడ్డి వస్తే….ఆలయాల నిర్మాణంకు 120 కోట్లు వ్యయం చేసామనన్నారు.

ఏపి,తెలంగాణ,తమీళనాడు,పాండిచ్చేరి రాష్ర్టాలలో 127 పూరాతన ఆలయాల పున:నిర్మాణం చేసాం…విటికి 139 కోట్లు కేటాయింపు చేసామని ఈ సందర్భంగా పేర్కొన్నారు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి. 2273 ఆలయాలు,గోశాలలు,భజన మందిరాలు నిర్మాణంకు 227 కోట్లు కేటాయించామని.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 1953 ఆలయాలు….సమ్రస్తా పౌండేషన్ ద్వారా 320 ఆలయాలు నిర్మిస్తూన్నామని చెప్పారు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version