అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ వారికి రిటర్నబుల్ ప్లాట్లు !

-

అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వనుంది చంద్రబాబు నాయుడు సర్కార్‌. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు సిద్ధం అయింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను ఇవాళ కేటాయించనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఆర్డీఏ అధికారులు.

amaravati chandrababu

ఈ మేరకు ఇవాళ లాటరీ తీసి ప్లాట్లు అప్పగించనున్నారు సీఆర్డీఏ అధికారులు. 2014-19లో 14 గ్రామాల రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని ఒప్పందం చేసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్‌.

ఈ మేరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఇందులో భాగంగానే… ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఆన్ లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్లాట్లు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. 14 గ్రామాల ప్రజలు ఈ లాటరికీ హాజరుకావాలని సీఆర్డీఏ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version