రిషితేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిషితేశ్వరి కేసుని కొట్టివేసిన గుంటూరు కోర్టు… ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రిషితేశ్వరి కేసుసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2015 జులై 14న నాగార్జున వర్సిటీ హాస్టల్‌లో రిషితేశ్వరి సూసైడ్ చేసుకుంది.
తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ సూసైడ్ నోట్ రాసింది. సరైన ఆధారాలు లేవంటూ.. ఈ కేసుని శుక్రవారం కొట్టేసిన న్యాయస్థానం… ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు కుటుంబ సభ్యులు.
కాగా, 2015 జులై 14న ఆచార్య నాగార్జున యునివర్శిటీలో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు తల్లిదండ్రులు. ఇక 9 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెల్లడించింది కోర్టు.