హీరోయిన్ సమంత కుటుంబంలో విషాదం..!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కుటుంబంలో చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణించారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన ఇంస్టా స్టోరీలో ”నాన్నను ఇక కలవలెను” అంటూ భావోద్వేగ పూరితమైన పోస్ట్ ను పెట్టింది. ఇక సమంత తండ్రి యొక్క మరణ వార్త తెలిసిన తర్వాత ఆమెకు సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

అయితే సమంత తండ్రి మరణానికి కార్డియాక్ అరెస్ట్ కారణం అని తెలుస్తుంది. ఇక రేపు చెన్నైలో జోసెఫ్ ప్రభు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. గతంలో తన తండ్రితో తనకు ఎటువంటి అనుబంధం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రేడింగ్ లోకి వచ్చాయి. తన సినీ కెరియర్ లో ఆయన ఎంత మద్దతుగా ఉన్నారు అనే విషయంను కూడా సమంత వివరించింది. అందుకే ఆమె సినిమా షూటింగ్స్ లో కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది.

Read more RELATED
Recommended to you

Latest news