మాజీ మంత్రి రోజా కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి రోజా పై అట్రాసిటీ కేసు నమోదు అయింది. తాజాగా మాజీ మంత్రి రోజా పై ఫిర్యాదు చేశారు దళితులు. దీంతో కర్నూల్ త్రీ టౌన్ పీఎస్ లో మాజీ మంత్రి రోజాపై కేసు అయింది. రోజా… మంత్రిగా ఉన్నప్పుడు దళితులను అవమానించారని కంప్లైంట్ చేశారు. సూర్యలంక బీచ్ లో ఉద్యోగితో చెప్పులు మోయించారని దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.
ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన కర్నూల్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మొదటగా మాజీ మంత్రి రోజా పై కేసు బుక్ చేసుకున్నారు. ఇందులో ఎంత మేరకు నిజం ఉందోననేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నిజం ఉందని తేలితే.. రోజా కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అటు ఇప్పటికే.. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో స్కాం జరిగిందని మాజీ మంత్రి రోజాపై ఆరోపణలు వస్తున్నాయి.