ఏపీలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రచ్చ జరుగుతోంది. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే కొండబాబు తన పేరు ప్రస్తావించడంపై వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే కొండబాబు చరిత్ర తెలుస్తుందని ఆయన వెల్లడించారు. దీనిపై తనకు ఎలాంటి సంబంధం లేదని, అధికారంలో ఉన్నవారు వాస్తవాల నిగ్గు తేల్చాలని ద్వారంపూడి సూచించారు.కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఎం చంద్రబాబు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రేషన్ బియ్యం మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.