రుషికొండ భవనాలపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

-

రుషికొండ భవనాలపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రుషికొండలో ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా…? అంటూ నిలదీశారు. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు ఆర్కే రోజా.


హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..? అని ఆగ్రహించారు రోజా. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..? అని నిలదీశారు ఆర్కే రోజా. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారు.. హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా.. ఈరోజు విమర్శలు చేసేది..? అని ఆగ్రహించారు ఆర్కే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news