వైసీపీలో చేరిన పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ !

-

జనసేన పార్టీ నేత, పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీ నేత, పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రెటరీ సందీప్ రాయల్ వైఎస్ఆర్సిపిలో చేరారు. ఆయనకు వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందీప్ తో పాటుగా జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త పద్మావతి కూడా వైఎస్ఆర్సిపి కండువా కప్పుకున్నారు.

Rukmini Kota Victim Sandeep Royal Joins YCP

పవన్ మాటల మాయలో పడి ఆయన కోసం, జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామన్నారు సందీప్, పద్మావతి. పవన్ ను నమ్ముకుంటే తమలాగే అందరిని నట్టేట ముంచి రోడ్డున పడేస్తారన్నారు. తల్లిదండ్రులు ఎవరూ వారి పిల్లలను పవన్ వెంట పంపవద్దన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానని, రాజకీయాల్లో మార్పు తెస్తానని చెప్పే పవన్ లో నిలకడలేదన్నారు. ధైర్యం ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version