ఉచితంగా సదరం సర్టిఫికెట్లు… ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వైద్యులు తాజాగా నిర్ధారించిన వైకల్య శాతంతో కూడిన పత్రాలు ఉచితంగా ఇవ్వబోతున్నారు.

అర్హత లేకున్నా దివ్యాంగుల కోటాలో చాలామంది పెన్షన్లు పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈ విషయం పైన గత కొద్ది రోజుల నుంచి ఫోకస్ పెట్టి వైద్య బృందాలతో తనిఖీలు నిర్వహించింది. వైకల్య శాతం ప్రస్తుతం ఉన్న దానికన్నా ఎక్కువగా మారిన వారికి కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.