త్వరలో నాయీ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి – సజ్జల ప్రకటన

-

త్వరలో నాయీ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటన చేశారు. ఈ సంవత్సరం అంతా చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మిడియా ప్రచారాన్ని హోరెత్తిస్తారని.. లబ్దిదారులే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లుగా మారాలని ఆగ్రహించారు.
చంద్రబాబు చీకటికి, జగన్ వెలుతురుకు ప్రతినిధులు అని.. పోరాటాల్లో రాటుదేలిన వ్యక్తి జగన్ అని కొనియాడారు.

చీమలు పెట్టిన పుట్టలో పాము వెళ్ళినట్లు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు కబ్జా చేశాడు.. వ్యవస్థలను మేనేజ్ చేయటం ద్వారా బతుకుతున్నాడనివెల్లడించారు. వైసీపీ నాయీ బ్రాహ్మణుల కృతఙ్ఞతా సదస్సులో సజ్జల మాట్లాడుతూ.. అబద్దం చెప్పకుండా చంద్రబాబు బతకలేడని.. కామన్ సెన్స్ కు, ప్రజలకు సంబంధం లేని నాయకుడని సెటైర్లు పేల్చారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు… బోయలు పల్లకి మోసినట్లు చంద్రబాబును ఎవరో ఒకరు మోయాలన్నారు. చంద్రబాబు లక్షల కోట్లు వెనక్కి వేశాడని.. ప్రజలను నమ్ముకున్న నాయకుడు జగన్ అన్నారు. త్వరలో ఎమ్మెల్సీ పదవి కూడా నాయీ బ్రాహ్మణులకు వస్తుందని హామీ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version