లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు నాయుడు : సజ్జల 

-

లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు నాయుడు అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు రిమాండ్ విధించింది కోర్టే కదా అని ప్రశ్నించారు. మొత్తం 4 కేసుల్లో ఆధారాలున్నాయి. రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు. ఐక్యరాజ్యసమితికి వినతి పత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్ననారు సజ్జల. స్కామ్ లో ఆధారాలు లభించాయని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని తెలిపారు.  

డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారు. లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉన్నారు. జనం నమ్మక చస్తారా అనే విధంగా టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ప్రజాధనం దోపిడికి గురైందని దర్యాప్తు చేసి సీఐడీ ఆధారాలు కోర్టుకు సమర్పించింది. దోపిడి దొంగల ముఠా అడ్డంగా దొరికిపోయిందని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్.. ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.ప్రతిపక్షాల వారు నిత్యం విమర్శిస్తారు.. అసలు ఈ  స్కామ్ గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version