చైనాలోని హంగ్జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో ఇండియా అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఇండియా 28 పతకాలు వచ్చాయి. ఇక ఏషియన్ గేమ్స్ లో హైదరాబాది షూటర్ ఇషా సింగ్ సంచలనాలు సృష్టిస్తున్నారు. బుధవారం ఒక స్వర్ణం, రజతం సాధించిన ఆమె ఈరోజు మరో 2 సిల్వర్ మెడల్స్ సాధించారు.
దీంతో ఆసియా క్రీడల చరిత్రలో నాలుగు పథకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. ఆమె 25 మీటర్ల పిస్టల్ టీమ్, 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో ఆమె పథకాలు సాధించారు. ఇది ఇలా ఉండగా, చైనాలోని హంగ్జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో ఇండియా టెన్నిస్ లో రజతం సొంతం చేసుకుంది. డబుల్ సు విభాగంలో భారత జోడి సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ 6-4, 6-4 తేడాతో చైనా చేతిలో ఓడటంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సాకేత్ మైనేని కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన క్రీడాకారుడు.