ఏపీలోని ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న పలు కేటగిరీల ఉద్యోగులకు పిఆర్సికి అనుగుణంగా 23% జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఈఆర్టి, పిటిఐ, డిపిఓ, సిస్టం ఎనలిస్ట్, సైట్ ఇంజనీర్స్, డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది.
జీతాల పెంపుపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ కు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది. CRP, MIS కోఆర్డినేటర్లు, డేటా ఆపరేటర్లు, అకౌంటెంట్లకు కూడా వేతనాలు పెంచాలని కోరింది.
ఇక అటు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఏపీ డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్. విశాఖలో ఉన్నటువంటి విమ్స్‌లో డాక్టర్ పోస్టుల భర్తీకి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. విమ్స్‌లో డాక్టర్ పోస్టుల భర్తీ 43 మంది నియామకానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.