ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 410 మంది ఉద్యోగుల తొలగింపు..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ లో వైసీపీ ప్రభుత్వం నియమించిన 410 ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలను పరిశీలిస్తున్నామని.. లీగల్ నోటీసులు ఇచ్చిన వివరాల కోరుతామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మకు 1కోట 15 లక్షలు అక్రమంగా ఇచ్చారని.. తిరిగి చెల్లించాలని.. చెల్లించకపోతే వర్మ పై కేసు పెడతామని చెప్పారు.

ముఖ్యంగా అపాయింట్ మెంట్ లెటర్లు లేని 410 ఉద్యోగులను తొలగించినట్టు ఆయన తెలిపారు. వైసీపీ నేతల ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లుగా చేసిన వారిని ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆరోపించారు. ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను అత్యంత చౌక ధరకు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. 2019లో 10లక్షలు కనెక్షన్లు ఉన్న ఫైబర్ నెట్ 2024 నాటికి 5 లక్షలకు పడిపోయిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news