రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని.. ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ర్మిల అన్యాయం జరిగిందని అంటున్నారు. ఆమెకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పాలి. YSRTP లో షర్మిలతో పాటు చాలా మంది తిరిగారు. మరీ వాళ్లకు అన్యాయం చేసినట్టు కాదా..? అని ప్రశ్నించారు సజ్జల. షర్మిల మాట్లాడిన ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా..? జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ఎన్నో చేసింది.
ఓదార్పు యాత్ర చేసినందుకు కాంగ్రెస్ ఏ స్థాయిలో వేదించిందో అందరికీ తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్ సొంత బాబాయి వివేకానంద రెడ్డితో ఎదురు పోటీ చేయించారు. 16 నెలలు జైలులో పెట్టించారు. సీబీఐ అప్పటి అధికారి లక్షీనారాయణ సైతం ఆ కేసుల్లో అవినీతి లేదని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను ఏ ఒక్కటీ కూడా అమలు చేయలేదని కూడా షర్మిల అంటున్నారంటే.. ఆ స్క్రిప్ట్ ఎవ్వరి నుంచి వచ్చిందో అర్థం చేసుకోవచ్చని సజ్జల దుయ్యబట్టారు.