కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధికారులతో పాటు కూటమి ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారు. మహిళల పట్ల కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు చాలానే బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ ఎస్ ఐ భాగోతం బయటపడింది.

ధర్మవరంలో ఎస్సై దారుణానికి ఒడిగట్టాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. వీడియో కాల్ చేసి బట్టలు విప్పి.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. ముదిగుబ్బ మండలం పట్నం ఎస్ఐ రాజశేఖర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ వీడియో బయటకు రావడంతో అతనిపై యాక్షన్ తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
https://twitter.com/Telugufeedsite/status/1955472759590682938
https://twitter.com/greatandhranews/status/1955487664532250954