టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. తాజాగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు నంద్యాల నుంచి విజయవాడకు వచ్చే మార్గంలో చాలా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో టైర్లను తగులబెట్టడం.. రోడ్డుపై బైఠాయించడం ఇలా రకరకాల ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉంటే.. ఓట్ ఫర్ నోట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ లూద్రా ప్రస్తుత చంద్రబాబు కేసు వాదించనున్నారు. సిద్ధార్థ లూద్రా ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు. దాదాపు చంద్రబాబు కేసులను సిద్దార్థ్ లోద్రా చూసుకుంటారు. అమరావతి కేసును కూడా సిద్దార్థ్ లోద్రా వాదించాడు. మరోవైపు సీఐడీ, సిట్ తరపున వాదనలు వినిపించనున్నారు ఏఏజీ సుధాకర్ రెడ్డి. విజయవాడలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు బందో బస్తు నిర్వహిస్తున్నారు. కోర్టు తీర్పును బట్టి విజయవాడలో పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.