సింహాచలం ప్రమాద ఘటన.. ఒకే కుటుంబలో నలుగురు మృతి

-

సింహాచలం ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపారు. చనిపోయిన తమవారిని తలుచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. కుటుంబ సభ్యుల రోదనలతో కేజీహెచ్ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుల వివరాలు.. పిళ్లా ఉమా మహేశ్వరరావు, శైలజ(సాఫ్ట్‌వేర్‌ దంపతులు), మహాలక్ష్మి, వెంకటరత్నం మొత్తం నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం అందుతోంది. ఈ ఘటనలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎడ్ల వెంకట్రావు.. మరియు దుర్గాస్వామి నాయుడు, మణికంఠ ఈశ్వర శేషారావు మృతి చెందారు.

ఇక అటు సింహాచలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహిళలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ముర్ము … మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు.

https://twitter.com/bigtvtelugu/status/1917456175668551685

Read more RELATED
Recommended to you

Latest news