తెలంగాణ రాజకీయాలపై ఓ మహిళకు ఉన్న క్లారిటీ ఇక్కడి నేతలకు లేకుండా పోయిందన్న కోణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘మొన్న ఈ పెద్దమ్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినయి!.
పదవుల కోసం పెదవులు మూసుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో.. ఉన్న పదవులన్నీ వదులుకుని, ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరో ఈ పెద్దమ్మ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. మీ క్లారిటీకి హ్యాట్సాఫ్! కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నడిపారో.. వారి సారథ్యంలో సబ్బండ వర్ణాల ప్రజలు ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో గుర్తుచేసిన ఈ ఉద్యమకారిణికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని కేటీఆర్ రాసుకొచ్చారు.
మొన్న ఈ పెద్దమ్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినయి!
పదవుల కోసం పెదవులు మూసుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో… ఉన్న పదవులన్నీ వదులుకుని, ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరో ఈ పెద్దమ్మ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది…
మీ క్లారిటీకి హ్యాట్సాఫ్!… pic.twitter.com/XqKwkUtixR
— KTR (@KTRBRS) April 30, 2025