కాకినాడలో బియ్యం అక్రమ రవాణా పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రేషన్ బియ్యం పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. పీఢీఎస్ రైస్ అక్రమ రవాణా కేసులన్నింటినీ సిట్ కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్ లో సమర్థవంతంగా పని చేసే ఐదుగురు అధికారులను నియమించింది.
సిట్ కి వినీత్ బ్రిజ్ లాల్ ను చైర్మన్ గా నియమించింది. బియ్యం అక్రమ రవాణా పై నమోదు అయిన కేసులన్నింటినీ సిట్ విచారించనుంది. ప్రతీ 15 రోజులకు ఒకసారి కేసు విచారణలో పురోగతి పై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్ కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ, హోం సెక్రటరీకి సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి నుంచి ప్రతీ 15 రోజులకొకసారి రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసుల పై నివేదిక తయారు చేయనున్నారు.