telangana Public administration victory celebrations: ప్రజా పాలన వియోజత్సవాల సంబరాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు గ్రాండ్ ఫినాలే వేడుకలు నిర్వహించనుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మూడు రోజుల పాటు గ్రాండ్ ఫినాలే వేడుకలు నిర్వహించనుంది. ఇక రేపు రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగం నూతన వాహనాల ప్రారంభోత్సవం ఉంటుంది. పోలీస్ బ్యాండ్, ఆయుధాల ప్రదర్శన కొనసాగనుంది.
8వ తేదీన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి శంకుస్థాపన ఉంటుంది. కమలాపురం ఫ్యాక్టరీ సహా 15 పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు ఉంటాయి. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరుగనుంది. 9వ తేదీన లక్ష మంది సమక్షంలో రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, డ్రోన్ షో, గ్రాండ్ కార్నివాల్ కార్యక్రమాలు ఉంటాయి. ఇక అటు తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.