ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచింది సిట్. 6 కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని జగన్ OSD కుమారుడు రోహిత్ రెడ్డికి చెందిన 6 కంపెనీల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. రాజేంద్రనగర్, ఎస్ఆర్ నగర్, శేరిలింగంపల్లి, మెహిదిపట్నం, గుడిమల్కాపూర్, యాకుత్పురా లో ఉన్న కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకునట్లు సమాచారం అందుతోంది.

ఇది ఇలా ఉండగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో .. కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యాడు. మైసూరులో గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసింది సిట్. పక్కా సమాచారం మేరకు గోవిందప్ప బాలాజీపై సిట్ నిఘా పెట్టింది. అనంతరం విజయవాడకు తరలించారు.