ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పహల్గామ్ అమరులకు నివాళులర్పించనుంది టీడీపీ పొలిట్ బ్యూరో. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ ఉంటుంది.

11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలపై చర్చించనుంది పొలిట్ బ్యూరో. అమరావతి పునర్నిర్మాణంపైనా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చోటుచేసుకుంది. టిడిపి ఎమ్మెల్యే సోదరుడు అరెస్టయ్యాడు. ఆలూరు కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో గుంతకల్ టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ ను ఏపీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.