సోమిరెడ్డి వి అంతా కక్ష సాధింపు.. క్యాష్ సాధింపులే : మాజీ మంత్రి కాకాణి

-

సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి మంత్రిగా ఉన్నపుడే అక్రమ లే ఔట్లు వెలిశాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తాాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పట్లో ఫిర్యాదులు రావడంతో విచారణ చేశారు. 40 అక్రమ లే ఔట్లు ఉన్నాయని నిర్దారించారు. వీటికి రూ.6 కోట్ల 50లక్షల మేర పెనాల్టీ వేశారు. పొదలకూరు ఒక పంచాయతీ మాత్రమే..నేను 10 ఏళ్ళు ఎం.ఎల్.ఏ.గా ఉన్నపుడు
రియల్టర్ల జోలికి పోలేదు. సోమిరెడ్డి ఎం.ఎల్.ఏ.అయిన తర్వాత కక్ష సాధింపు..క్యాష్ సాధింపులు ఉన్నాయి.  ఇవ్వనటువంటి వారిని ఇబ్బందులు పెడుతున్నారు.

నిన్న ఆయన నెల్లూరులోని శ్రీ రాజరాజెశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. సోమిరెడ్డికి దైర్యం ఉంటే ఎం.ఎల్.ఏ.అయిన తర్వాత అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయగలరా..? లే ఔట్ లకు తనకు తెలియకుండా అనుమతులు ఇవ్వవద్దని నుడా అధికారులను సోమిరెడ్డి ఆదేశించారు. ఎవరి హయాంలో అవినీతి జరిగిందనే విషయం పై దమ్ముంటే విచారణ చేద్దాం. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఉంది. అన్ని లే ఔట్ల పై విచారణ చేయండి. సోమిరెడ్డికి క్యాష్ ఇస్తే అది సక్రమ లే ఔట్ అవుతుంది. ఇవ్వకపోతే అక్రమ లే ఔట్ గా చెబుతున్నారు. సర్పంచ్ లను భయపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. ఏ.పీ.జెన్ కో నుంచి ఫ్లై యాష్ లో నెలకు రూ.20 లక్షలు మామూళ్లు తీసుకుంటున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సోమిరెడ్డి సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version