త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని జగన్ తరహాలోనే కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ భవన్ నుండి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల బృందం..తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ…గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసామని.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్కు వివరించామని తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని ఆగ్రహించారు.
నిరుద్యోగులపై దాడులు కేసులు దాడులు జరుగుతున్నాయని… ఒక భయానక వాతావరణాన్ని హైదరాబాదులో సృష్టించారని.. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని గుర్తు చేశారు. జాబ్ క్యాలండర్ ఉంటే ఇస్తామని హామీ నిలబెట్టుకోలేదని… సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను నేర్చుకొచ్చి అరెస్టులు చేశారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశామని… పదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందని కేటీఆర్‌వెల్లడించారు. ఎన్నికలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుందని… మాకు కనీసం నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదన్నారు. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తామని హెచ్చరించారు కేటీఆర్.