తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. ఇవాళ్టి నుంచే సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మే 26 వ తేది వరకు అంటే 11 రోజులు జరుగుతాయి సరస్వతి పుష్కరాలు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి దంపతులు రానున్నారు.

ఈ తరుణంలోనే సరస్వతి పుష్కరాలకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు వాడుకుంటున్నారు. అమలాపురం నుంచి బస్సులు ఏర్పాటు చేసింది APSRTC. ఇదిలా ఉండగా, కటౌట్‌లో రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర సరస్వతి దేవి పోటో పెట్టి అవమానం చేసారని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కటౌట్‌లో రేవంత్ రెడ్డి దంపతులు, కాంగ్రెస్ మంత్రుల కాళ్ళ దగ్గర చదువుల తల్లి సరస్వతి దేవి ఫోటో పెట్టారని గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళేశ్వరం బస్టాండ్ దగ్గర సరస్వతి దేవిని అవమానిస్తూ కటౌట్లు వెలసినట్లు పోస్టులు పెడుతున్నారు.