తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన జరిగింది. మహిళలతో ప్రపంచ అందగత్తెల పోటీదారులు కాళ్ళు కడిగించింది తెలంగాణ ప్రభుత్వం అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఆ తర్వాత టవల్స్‌తో వారి కాళ్ళు కూడా తుడిపించిందట సర్కార్. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై కేటీఆర్ స్పందించారు.

అయితే ఈ అంశంపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంచెం కూడా మైండ్ లేదని.. తెలంగాణ ఆడపడుచులతో ఇలాంటి పనులు చేయిస్తాడా అని ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటే సంస్కృతి ఇది కాదని.. కానీ వరంగల్ గడ్డపైన తెలంగాణ మహిళలను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Congress CM has officially lost his mind https://t.co/oPXT15IcW5
— KTR (@KTRBRS) May 15, 2025