ఓటమి తర్వాత మొదటిసారి వైసీపీ శ్రేణులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి..!

-

రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలో తన స్వగృహంలో రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. అయితే 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కూటమి హావలో వైసీపీ దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి తర్వాత మొట్ట మొదటిసారిగా వైసీపీ కి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో సమావేశయం అయ్యాడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

ఇందులో భాగంగా మాట్లాడుతూ.. అందరం కలిసి సమిష్టి కృషితో వైసీపీని బలోపేతం చేద్దామని వైసీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు శ్రీకాంత్ రెడ్డి. కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా తోడుంటా అని పేర్కొన మాజీ ఎమ్మెల్యే.. ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు శ్రీకాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version