Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఆగస్ట్ నెలలో 5 కోట్ల మార్క్ దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. తిరుమలలో 26 కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచివున్నారు భక్తులు. ఇక దీంతో టోకేన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అటు నిన్న తిరుమల శ్రీవారిని 72, 967 మంది భక్తులు దర్శించుకున్నారు.
32, 421 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.26 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమలలో చిరుతల సంచారం కారణంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30 వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించనుంది టిటిడి పాలక మండలి.