తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు వింత జంతువులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆలమూరు పరిసర ప్రాంతాల్లో మళ్లీ వింత జంతువు కలకలం మొదలయింది. నవాబుపేట గ్రామంలో గత రాత్రి వింత జంతువు దాడిలో ఓ రైతుకు చెందిన లేగ దూడ మృతి చెందింది. లేగ దూడ పొట్టను చీల్చి మాంసం తిని వింత జంతువు వెళ్ళింది. వింత జంతువును తొడేలుగా స్థానిక రైతులు, ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం జొన్నాడ, పెనికేరు, నవాబుపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో లేగ దూడలను జంతువు చంపింది. మరోసారి వింత జంతువు పాడి పశువులపై దాడి చేయడంతో ఉలిక్కిపడుతున్న… అధికారులు చర్యలు తీసుకోవాలని ఆలమూరు, కపిలేశ్వరపురం ప్రాంతాల రైతులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.