ఆ ఊరిలో వింత ఆచారం..వధువుతో తాళి..

-

కొన్ని ఆచారాలు మనుషులను ఆలోచింప చేస్తాయి..వాటిని మార్చాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు..కానీ కుక్క తోక వంకర అన్నట్లు మళ్ళీ అదే తంతు చేస్తారు.ఇప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.తాజాగా మరో వింత ఘటన వెలుగు చూసింది.అచ్చం జంబలకడి పంబ సినిమాలో లాగా ఓ పెళ్ళి జరిగింది.ఆ పెళ్ళిలో వరుడు మెడలో వధువు తాళి కట్టింది.ఆ ఊరిలో మొత్తం ఇలాంటి ఆచారం ప్రకారం పెళ్ళిళ్ళు జరుగుతాయట..ఆ వింత పెళ్ళి ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామ పెద్దలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు. వరకట్నాల్లాంటివేమీ లేకుండా పెళ్లిళ్లు జరగడం నువ్వలరేవు ప్రత్యేకత. గ్రామంలో రెండేళ్లకు ఓసారి పెళ్లీడుకు వచ్చిన యువతీ యువకుల్ని గుర్తించి వారికి పెళ్లి సంబంధాలు కుదుర్చుతారు. తర్వాత సామూహికంగా ఒకే మూహూర్తంలో అందరి పెళ్లిళ్లు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఊరు ఊరంతా సన్నాయి మేళాలతో సందడి నెలకొంటుంది.

అయితే ఈ ఊరి వాళ్ళు, ఆ ఊరి వాళ్ళనే పెళ్ళి చేసుకుంటారు.వరకట్న బాధలు లేకపోవడం, పైగా వరుడి మెడలో వధువు తాళి కట్టడం ఇలా ఎన్నో ప్రత్యేకలు ఈ నువ్వలరేవు గ్రామానికి ఉన్నాయని గొప్పగా చెప్తారు స్థానికులు. విశాలమైన ఉప్పుటేరు సమీపంలో బతుకునావ లాగిస్తున్న ఈ ఊరి గ్రామస్థులు.. సంప్రదాయల్ని పాటించే విషయంలో కచ్చితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఇలాంటి ఆచారం కొనసాగుతుంది.. అది వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆ ప్రాంత వాసులు చెబుతుండడం విశేషం..

Read more RELATED
Recommended to you

Exit mobile version