వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం

-

ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సిబిఐ.. ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కేసులో సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

విచారణ అధికారిని తక్షణమే మార్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే విచారణ అధికారి రాంసింగ్ ను మార్చివేయాలని జస్టిస్ ఎం ఆర్ షా సిబిఐకి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version