ఏపీ CBCID మాజీ చీఫ్ సంజయ్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఏపీ CBCID మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతి కేసులో ఏపీ CBCID మాజీ చీఫ్ సంజయ్ పై FIR దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఏపీ CBCID మాజీ చీఫ్ సంజయ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ వచ్చింది.
హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ తరుణంలోనే తాజాగా ఏపీ CBCID మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. కాగా, మాజీ మంత్రి, వైసిపి నేత కాకాని గోవర్ధన్ కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో అడిషనల్ సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని వార్తలు వస్తున్నాయి. రుస్తుం వైన్స్ లో పేలుడు పదార్థాలు… గిరిజనులు నిలదీయడం జరిగిందని సమాచారం. ఈ తరుణంలోనే ఆ గిరిజనులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అనుచరులు బెదిరించారని అభియోగాలు వస్తున్నాయి.