హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఘాటు వ్యాక్యలు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఓ వీడియోను అటాచ్ చేసిన ఆయన..
‘హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇండ్లు – హెచ్‌సీయూలో పక్షుల గూళ్లు.. నోరున్న జనంపైకి బుల్డోజర్ – నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్!…మూసీలో, హైడ్రాలో మూటల వేట – ఆఖరికి హెచ్‌సీయూలోనూ కాసుల వేట..పంటలు ఎండుతున్నాయి నీళ్లు లేవంటూ రైతుల గోస – అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణాల హాహాకారాలు..చదువులు చెప్పే చోట విధ్వంసం – విలువగల భూములపై వికృత క్రీడ, ప్రజలను పాలించే నాయకుడివా భూములు చెరబట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా? అప్పుడు ఫుట్‌బాల్‌తో నీకు ఆటవిడుపు – ఇప్పుడు మూగజీవాల ప్రాణాలతో, భావిభారత భవిష్యత్ విద్యార్థులతో ఆటలా?
ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను హింసించే పాలన..ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం’ అని రాసుకొచ్చారు.
హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇండ్లు – హెచ్‌సీయూలో పక్షుల గూళ్లు
నోరున్న జనంపైకి బుల్డోజర్ – నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్!
మూసీలో, హైడ్రాలో మూటల వేట – ఆఖరికి హెచ్‌సీయూలోనూ కాసుల వేట
పంటలు ఎండుతున్నాయి నీళ్లు లేవంటూ రైతుల గోస – అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణాల… pic.twitter.com/jvTFiO1hB4
— KTR (@KTRBRS) April 1, 2025