YCP: పోస్టల్ బ్యాలెట్ కేసుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నేడు సుప్రీం కోర్టులో పోస్టల్ బ్యాలెట్ కేసుపై విచారణ జరుపనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ తరఫున పిటిషనర్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలన్న ఈసీ నిబంధనను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
తొలుత హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ..ఇప్పుడు సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాలని సూచించిన హైకోర్టు…ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ వైఎస్సార్సీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్సార్సీపీ. పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఎదుట విచారణ జరుగనుంది.